నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి టిడిపి కేంద్ర కార్యాలయంలో లీడర్షిప్ కాంక్లేవ్ - హాజరైన తంబళ్లపల్లి టిడిపి ఇన్చార్జ్ జి.శంకర్ యాదవ్ మదనపల్లె : అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం లీడర్షిప్ కాంక్లేవ్ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.ఈ ప్రతిష్టాత్మక కాంక్లేవ్‌కి తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్,మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ హాజరయ్యారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పలు అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ కాంక్లేవ్ అద్భుతంగా సాగిందని,రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం,ప్రతిపక్ష వైకాపా విమర్శలను సమర్థవంతంగా తిప్పి కొట్టడం,త్వరలో జరుగబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి చక్కగా దిశానిర్దేశం చేశారన్నారు.కూటమి ధర్మం పాటిస్తూ మూడు పార్టీల నాయకులను అన్ని నియోజకవర్గాలలో కలుపుకొని పోవాలని సూచించారన్నారు.2024 శాసనసభ ఎన్నికల స్ఫూర్తితో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని తెలిపారన్నారు.సీఎం చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం ఆసక్తిని కలిగించిందని,పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందనడం సందేహం లేదన్నారు.తంబళ్లపల్లె నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని,స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.ఈ కాంక్లేవ్‌కి రాష్ట్రంలోని టిడిపి ఎమ్మెల్యేలు,నియోజకవర్గ ఇన్చార్జిలు హాజరు కావడంతో సందడి వాతావరణం నెలకొందన్నారు.
Reporter
Namitha News