నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 22 : అమరావతికి మేము వ్యతిరేకం కాదు.. అందులో జరిగే అవినీతికి మా పార్డీ వ్యతిరేకం. అమరావతి లోనే అడుగుకు నాలుగు వేలతో ప్రవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం దేశంలో లేని విధంగా అడుగుకు ఇరవై వేల రూపాయలతో రాజధాని నిర్మాణం చేపడుతున్నారు ఇందులో భారీ అవినీతి చోటుచేసుకొంటుంది మదనపల్లి జిల్లా ప్రకటన తప్ప అభివృద్ధి శూన్యం. మెడికల్ కళాశాలను జగన్ మోహన్ రెడ్డి తీసుకుని వస్తే కూటమి ప్రభుత్వం ఆపేసింది. డెబై శాతం మెడికల్ కళాశాల నిర్మాణం ఇప్పటికే పూర్తి అయ్యింది మరో వంద కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వం ఆధీనంలో మెడికల్ కళాశాల నడపవచ్చు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మదనపల్లె బిటి కళాశాల యూనివర్సిటీకి కోసం జీవో విడుదల చేసింది. బిటి కళాశాలతో నియోజక వర్గం బాగుపడుతుంది. దీనిపై కూటమిలోని నేతలు దొమ్మలపాటి రమేష్ రాందాస్ చౌదరి ఎందుకు మౌనం వహిస్తున్నారు. మదనపల్లె టౌన్ బ్యాంక్ లో అవకతవకలు జరుగుతున్నాయి. ఈవిషయం తెలుగుదేశం వారే నాకు సమాచారం అందించారంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై సమగ్ర దర్యప్తు కు డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అభివృద్ధి పేపర్ మీద కాకుండా నేరుగా చెయ్యాలి. రెండేళ్లు గడచినా అభివృద్ది చేసిన దాఖాలాలు లేవు. మెడికల్ కళాశాల, భకబ్జాలు కూటమి మోసాలపై ప్రజలను చైతన్య పరుస్తాము. అభివృద్దిని అడిగితే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లేక నది మల్లయ్యకొండ లో ప్రభుత్వం మైనింగ్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ చూస్తూ ఉండదు స్థానికులతో కలసి వైఎస్ఆర్ పార్టీ మైనింగ్ అడ్డుకొంటుంది డిఎస్సీలో మొదటి ర్యాంక్ తెచ్చుకున్న వ్యక్తిని పక్కన పెట్టడంతోనే లికేజి వ్యవహామ బయటపడింది. పరీక్ష రాసి తెచ్చుకోవలసిన ఉద్యోగం అడ్డదారుల్లో తెచ్చుకోవడం అప్రజాస్వామికం. డిఎస్సీ పై పూర్తి విచారణ జరపాలి. మిథున్ రెడ్డి డిమాండ్ మామిడి రైతులు పూర్తిగా నష్టపోయింది. కూటమి ప్రభుత్వం లో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారిని ఆదుకోవాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నకల్లో ప్రజల్లో మాపైన ఉన్న నమ్మకమే మమ్మల్ని గెలిపిస్తుంది
Reporter
Namitha News