Monday, 14 September 2026 07:44:05 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

వైకాపా చెత్త మీద పన్ను వేస్తే మేము ఆ చెత్తనే కొంటున్నాం - రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ పట్టాభిరామ్

Date : 03 March 2026 08:26 PM Views : 328

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 03 : నాటి వైకాపా ప్రభుత్వం చెత్త మీద పన్నువేసి చెత్త ప్రభుత్వం గా నిలవగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఆ చెత్తని ప్రజలకు సేవ చేస్తున్నట్లు రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. మంగళవారం ఆయన స్వచ్ఛ ఆంధ్ర పై తంబళ్లపల్లె నియోజకవర్గం లోని అధికారులతో జరిగిన సమీక్ష లోఆయన ఆరు మండలాల ఎంపీడీవోలతో పారిశుధ్యం తో పాటు డంపింగ్ యార్డ్ ల నిర్వహణ, చెత్త సేకరణ, ఎరువుల తయారీ, స్వచ్ఛ వాహనాలపై విడివిడిగా చర్చించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే ఎక్కడా లేని విధంగా పారిశుద్ధ్యనికి పెద్ద పీట వేసి నెలలో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం చేపట్టిన ఘనత ఆయనదేనన్నారు. అధికారులు అంకెల గారిడి లేకుండా చిత్తశుద్ధితో చెత్త సేకరణ పై దృష్టి సారించి స్వచ్ఛరథాల నిర్వహణ లోపం లేకుండా చూడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 ప్లాస్టిక్ మేనేజ్మెంట్ యూనిట్లు, 12 వేలకు పైగా ట్రై సైకిళ్లు, 5000 స్వచ్ఛ రథాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లోని కురబలకోట, మొలకలచెరువు లలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. గ్రామాలలో టాయిలెట్లు, కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మాణానికి ఎన్ని నిధులైన అందుబాటులో ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ద్వారా మంజూరు చేయించుకుని నిర్మించాలన్నారు.పంచాయతీల అభివృద్ధికి పన్నులు వసూళ్లతో పాటు గ్రామాల అభివృద్ధికి సమిష్టి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం పారిశుధ్యం పై నిర్లక్ష్యం వహించిందని నేడు ఎన్డీఏ పాలనలో స్వచ్ఛ ఆంధ్ర కు ప్రాధాన్యతనిచ్చి పల్లె సీమలు పర్యావరణ పరిరక్షణ తో అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. పారిశుద్ధ్యం తో పాటు తాగునీటి సమస్యలు, మౌలిక సదుపాయాలపై నాయకులు అధికారుల సమన్వయంతో అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఓ రాధమ్మ, డి ఎల్ పి ఓ నాగరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సతీష్ కుమార్, డి ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈ వినోద్ కుమార్ ఆరు మండలాల ఎంపీడీవోలు, అన్ని శాఖల అధికారులు, అధికార పార్టీ కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన కొమ్మిరెడ్డిః రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కొమ్మిరెడ్డి పట్టాభిరామ్ తంబళ్లపల్లెలో పురుషోత్తం ఏర్పాటుచేసిన స్వచ్ఛరథాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ స్వచ్ఛరథం ద్వారా సేకరించిన ప్లాస్టిక్, తడి పొడి చెత్త సేకరించి అందుకు సరిపడా సరుకుల రూపంలో ప్రజలకు అందించాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సహకరించాలని సూచించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :