నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో మెగా క్యాంపస్ డ్రైవ్ విజయవంతం - 120 మందికి ఉద్యోగాలు మదనపల్లెలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు జరిగిన మెగా క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ కు విద్యార్థుల నుండి అఖండ స్పందన లభించింది. ఈ డ్రైవ్‌లో CSE, AIDS, ECE, EEE మరియు Mechanical బ్రాంచ్‌లకు చెందిన మొత్తం *216 మంది విద్యార్థులు* పాల్గొన్నారు. వీరిలో *120 మంది విద్యార్థులు* ఉద్యోగాలకు ఎంపికై ఆఫర్ లెటర్లు అందుకున్నారు. *ఎంపికలు అందించిన కంపెనీలు:* 1. *Wipro Enterprises Pvt. Ltd* 2. *INEL Power System Engineers Private Limited* 3. *MITSUBA INDIA PRIVATE LIMITED* 4. *ModPro Engineering Solutions Pvt Ltd* 5. *Sri Sai Power and Equipment's Pvt Ltd* 6. *Breaks India Private Limited* ఈ ఘన విజయం సందర్భంగా కళాశాల ఛైర్మన్ *శ్రీ M. ప్రభాకర రెడ్డి* గారు విద్యార్థులందరినీ అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. D. రమణారెడ్డి గారు, ఉప ప్రిన్సిపాల్ డా. B. సుబ్బారెడ్డి గారు, కంపెనీల HR ప్రతినిధులు, ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్లు, అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల కృషికి, కళాశాల ప్లేస్‌మెంట్ సెల్ పట్టుదలకు ఇది నిదర్శనమని యాజమాన్యం పేర్కొంది.
Reporter
Namitha News