Sunday, 13 September 2026 04:29:36 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి

Date : 14 April 2026 03:50 PM Views : 222

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : మదనపల్లె సమీపంలోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు మైభారత్ అన్నమయ్య సంస్థ వారి ఆధ్వర్యంలో డాక్టర్‌ భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, యెన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ పి.రాజేష్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సామాజికంగా దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడు మన అంబెడ్కర్ అని తెలిపారు. ఇప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అని, ఆయన సూచించిన మార్గాలే పాలకులకు మార్గదర్శకాలు అని, ఆయన ఆలోచనల నుంచి జాలువారిన నిర్ణయాలు, ప్రతిపాదనలు సమాజ ప్రగతికి సోపానాలుగా నిలిచాయి అన్నారు. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన గొప్పదనాన్ని నెమరేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యువత తరాలు ఆయన ఆశయాలను ఆకళింపు చేసుకుని, సమానత్వం, బౌద్ధికత, మానవత్వం వంటి విలువలను తమ జీవితాల్లో అనుసరించాలి. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, సమాజంలో మార్పు తీసుకురావడానికి మనమందరం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో యన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ రాజేష్, యన్.సి.సి 11 ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ చరణ్ కూచి మరియు యన్.ఎస్.ఎస్. మరియు యన్.సి.సి విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :