నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - ఏప్రిల్ 14 : తంబళ్లపల్లె ఎన్టీఆర్ ఘాట్ లో మంగళవారం టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి పంచి పెట్టారు దళిత బడుగు బలహీన పీడిత వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ దేశానికి చేసిన సేవను కొనియాడారు. కార్యక్రమంలో వెంకట్రెడ్డి, పురుషోత్తం, కాలా నారాయణ, రామచంద్ర, నరసింహులు,వీరాంజనేయులు, రామ లక్ష్మమ్మ, రామచంద్రారెడ్డి, సోమశేఖర్, శంకర, సి సి కత్తి నరసింహులు,లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, పంచాయతీ భాస్కర్, పోర్డు నరసింహులు, కార్యదర్శి హరి ప్రసాద్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News