Sunday, 13 September 2026 05:40:28 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అనారోగ్యంతో కానిస్టేబుల్ గండి వెంకటేశ్వర్లు మృతి

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 07 July 2026 04:47 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి టి.సుండుపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గండి వెంకటేశ్వర్లు (46) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఆయన గత 15 ఏళ్లుగా కడప, అన్నమయ్య జిల్లాల్లో క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఆయనకు భార్య ప్రమీల, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సమర్థుడైన కానిస్టేబుల్‌ను కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు మృతుని నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. దహన సంస్కారాల తక్షణ ఖర్చుల కోసం ఎస్పీ తరఫున రూ.1 లక్ష నగదును మృతుని సతీమణి ప్రమీలకు అందజేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంగళవారం రాయచోటి మండలం మాసాపేట రెడ్డివారిపల్లి గ్రామంలో వెంకటేశ్వర్లు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఏఆర్ పోలీసు బృందం గాలిలోకి కాల్పులు జరిపి 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో కడసారి గౌరవ వందనం సమర్పించింది. అంతిమయాత్రలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :