నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 29 : మండలంలోని ఎద్దుల వారి పల్లె దళితవాడలో శనివారం పౌర హక్కుల దినోత్సవ సభ తూతూ మంత్రంగా నిర్వహించారు. ఉదయం ఎంఈఓ త్యాగరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దళితవాడకు చెందిన గ్రామస్తులు తమకు రోడ్డు సౌకర్యం లేదని తాగునీరు ట్యాంకర్లతో తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, ఇంకా పలు సమస్యలపై అధికారులకు మొరపెట్టుకున్నారు. దళితవాడలో పలువురు విద్యార్థులు జ్వరం బారిన పడ్డారని ఆరోపించారు. అధికారులు దళితుల సమస్యల పరిష్కార హామీతో సభ ముగించారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు, అన్ని శాఖల అధికారులు రాకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ వీఆర్వో వెంకటేష్, అంగన్వాడి సూపర్వైజర్ చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News