Saturday, 12 September 2026 05:27:53 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

వి.బి.జి. రాంజీ పథకంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి - జిల్లా పిడి వెంకటరత్నం

Date : 25 August 2026 10:12 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఆగస్టు 25 : తంబళ్లపల్లె మండలం లో విబిజీ రాంజీ పథకంలో జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలని జిల్లా డ్వామా పిడి వెంకటరత్నం ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండలంలోని మర్రిమాకుల పల్లె పంచాయతీలోని తాతిరెడ్డి చెరువులో జరుగుతున్న పూడిక తీత పనులను పరిశీలించి ఉపాధి హామీ సిబ్బందితోపాటు కూలీలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ఎల్ నినో ప్రభావంతో వర్ష బావం ఏర్పడిందని ఈ సమస్యను అధిగమించడానికి జల సంరక్షణ పనులు విరివిగా చేపట్టాలన్నారు. చెరువుల్లో పూడికతీత పనులు ముమ్మరం చేసి భవిష్యత్తులో చెరువులు నీటితో నిల్వ ఉండడానికి ఆస్కారం ఉందన్నారు. అదేవిధంగా పశుగ్రాసం కొరత అధిగమించడానికి వాడు రైతులకు గడ్డి పెంపకానికి అవగాహన కల్పించాలని సూచించారు. సాగునీరు కలిగిన రైతులకు పండ్ల తోటలు పెంపకం పై దృష్టి సారించేలా చొరవ చూపాలన్నారు. వి బి జి రామ్ జి ఉపాధి పనులలో కూలీలు ముమ్మరంగా పాల్గొనాలని వారికి సకాలంలో బిల్లులు చెల్లింపు జరుగుతుందని సూచించారు. మండలంలో జరుగుతున్న వి బి జి రాంజీ ఉపాధి పనుల నిర్వహణపై మండల స్థాయి ఉపాధి అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణలో ఫీల్డ్ అసిస్టెంట్ల సహకారంతో పనులు ముమ్మరంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టిఎంసి లక్ష్మీనారాయణ, టెక్నికల్ అసిస్టెంట్ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహులు, కూలీలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :