Wednesday, 29 July 2026 11:14:04 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

లే అవుట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రజలకు ఓ సువర్ణావకాశం - పి.కె.ఎం.యు.డి.ఎ. చైర్మన్ సురేష్ బాబు

Date : 16 December 2025 07:34 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 16 : మున్సిపాలిటీలు, మండలాలు, మేజర్ పంచాయతీ లలో అనధికార లేఔట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రతి ఒక్కరికి ఓ సువర్ణ అవకాశమని పలమనేరు - కుప్పం - మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సురేష్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం గతంలో అనధికార లేఔట్లు సమస్యలపై ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి, పేద ప్రజలకు భవిష్యత్తులో ప్లాట్ల విషయమై ఇబ్బందులు లేకుండా క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 23 లోపు లేఔట్లకు 14 శాతం ఓపెన్ ఖరీదులో 50% మినాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. లేఔట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరణతో భవిష్యత్తులో ఏ విధమైన ఇతర అదనపు చార్జీలు లేకుండా భవనాలకు అనుమతి, ప్లాన్ అనుమతితో బ్యాంకు రుణ అవకాశం, న్యాయబద్ధంగా తన స్థలము అమ్ముకునే వెసులుబాటు, చట్టబద్ధంగా స్థలానికి భద్రత ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది 23 వ తేదీ లోపు దరఖాస్తు చేయని అనధికార లేవట్ల స్థలాల యందు భవిష్యత్తులో ఎలాంటి భవనాలకు అనుమతులు ఉండవని అలా నిర్మించిన చట్టపరమైన చర్యలు చేపట్టి కూల్చివేయడం జరుగుతుందన్నారు. దీంతోపాటు అమ్మకం కొనుగోలు వీలు లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో నిషేధం అమలు పరుస్తామన్నారు. ఈ అవకాశాన్ని మధ్యతరగతి, నిరుపేద, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ,లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి తంబళ్లపల్లె సమన్వయకర్త సీడ్ మల్లికార్జున నాయుడు, తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, పి కే యం యు డి ఎ సెక్రటరీ మనోహర్, ఏఎస్ఐ నజీర్ భాష,టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, కుప్పం సింగల్ విండో అధ్యక్షుడు రఫీ, రవిచంద్ర బాబు, టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, డేరంగులచంద్ర, పురుషోత్తం , వీఆర్వో నాగరాజు, కార్యదర్శి శ్రీనివాసరావు, రెవిన్యూ, మండల పరిషత్ అధికారులు,మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :