Sunday, 13 September 2026 10:21:07 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లె లో సూర్యఘర్ సోలార్ విద్యుత్ కు శ్రీకారం

విద్యుత్ శాఖ అధికారుల చొరవ-లబ్ధిదారులకు విద్యుత్ బిల్లు ఉపశమనం

Date : 31 May 2026 09:03 PM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 31: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రజలను విద్యుత్ చార్జీల మోత నుండి విముక్తి పొందడానికి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం తంబళ్లపల్లె మండలంలో శ్రీకారం చుట్టుకుంది. తంబళ్లపల్లె మండలంలో విద్యుత్ శాఖ అధికారులతో పాటు అన్ని శాఖల అధికారులు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రజల్లో అవగాహన పెంచడంతో మండలంలో సూర్య ఘర్ పథకానికి బీజం పడి ఇప్పటికి సుమారు 30కి పైగా సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకొని లబ్ధిదారులు విద్యుత్ బిల్లులు ఆదాతో పాటు అదనపు ఆదాయం సమకూరడంతో ప్రజల్లో రోజురోజుకీ ఆసక్తి పెరిగిపోతోంది. సోలార్ ఉత్పత్తి తోపాటు నీటిని, భవనాలను, ఇండ్లలో వంట తోపాటు వ్యవసాయ పంపుసెట్లకు నీటిని తోడే విద్యుత్ శక్తి ఉత్పత్తి జరుగుతుంది,ప్రభుత్వం సోలార్ విద్యుత్ పథకం లో ఎస్సీ ఎస్టీలకు ఉచితం కావడంతో పలువురు సోలార్ కనెక్షన్లు తీసుకోగా మండలంలోని తంబళ్లపల్లె, కోసువారిపల్లె, గోపి దీన్ని తో పాటు పలు ప్రాంతాలలో పలువురు లబ్ధిదారులు సోలార్ విద్యుత్ రూఫ్ టాప్ కనెక్షన్ తీసుకుని విద్యుత్తు తో లబ్ధి పొందుతున్నారు. ఈ సోలార్ విద్యుత్ కనెక్షన్లకు అవసరమైన నిధుల కోసం బ్యాంకర్లు సైతం రుణం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో కొందరు లబ్ధిదారులకు బ్యాంకుల్లో సిబిల్ స్కోర్ లేక కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోలార్ విద్యుత్తు ఒక కిలోవాట్ విద్యుత్ కు 120 యూనిట్లకు కరెంటు బిల్లు రూ 1000 వస్తే సోలార్ యూనిట్ తో కేవలం రూ 338 బిల్లుతో రూ 8000 ఆదా అయి రూ 30 వేలు రాయితీ, 2 కె.వి కి 200 యూనిట్లు కు రూ 2000 విద్యుత్ బిల్లు వస్తే సోలార్ తో కేవలం రూ 333 లతో పాటు రూ 20000 ఆదాతో రూ 60,000రాయితీ,3 కెవికి 300 యూనిట్లు విద్యుత్తుకు రూ 3000 విద్యుత్ బిల్లు సోలార్ బిగిస్తే రూ293 తోపాటు రూ 32400 ఆదాతో రూ 78000 రాయితీ వర్తిస్తుంది. ఈ సోలార్ విద్యుత్ లో ఆన్ గ్రేట్, అప్గ్రేడ్ విధానాలు ఉంటాయి. ఈ సోలార్ విద్యుత్తు యూనిట్ల విషయంలో లబ్ధిదారులు సరైన కంపెనీలు ఎంపిక చేసుకొని విద్యుత్ ఆదాతో పాటు అదనపు ఆదాయంతో లబ్ధి పొందవచ్చు. ః సోలార్ విద్యుత్తుతో అదనపు ఆదాయం: శివ క్రాస్ రోడ్ తంబళ్లపల్లె. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో వన్ కెవి సోలార్ యూనిట్ బిగించుకున్నాను. ప్రతినెల రూ 400 కరెంట్ బిల్లు వచ్చేది. సోలార్ తో నాకు కరెంట్ బిల్లు మినహాయించి నాకే రూ 400 పైగా ఆదాయం వచ్చింది. ః తంబళ్లపల్లెలో సోలార్ విద్యుత్తుకు సమిష్టి కృషి. ఏఈ సురేంద్ర. తంబళ్లపల్లె మండలంలో ఎస్ పి డి సి ఎల్, అన్ని శాఖల అధికారుల సహకారంతో సోలార్ విద్యుత్తు పై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఇంటికి విద్యుత్ బిల్లుల ఉపశమనం కోసం సోలార్ రూఫ్ టాప్ విద్యుత్తు వెలుగులు నింపడానికి సమిష్టి కృషి చేస్తాం

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :