నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - మార్చి 22 : రామసముద్రం మండలం లో ఆదివారం భూవివాదం హింసాత్మక ఘర్షణకు దారితీసింది. భూసాని కురప్పల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు మంజునాథ్ కు, అదే గ్రామానికి చెందిన సిద్దరాజు, వెంకటరమణ, శ్రీనివాస్ లతో భూ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడం తో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి, మదనపల్లె జిల్లా ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు లో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Admin
Namitha News