నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి, అక్టోబర్ 15: జీవనోపాధి నిమిత్తం సుండుపల్లె మండలం గడ్డమీదపల్లె గ్రామ నివాసి కంపా వీరాంజనేయులు కువైట్ లో అనుమానాస్పదంగా మృతి చెందాడని మృతుడి మరదలు కంపా లలిత, మృతుడి పిల్లలు విష్ణువర్ధన్-గోవర్ధన్ లు , *జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారిని కలిసి* మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని విన్నవించుకున్నారు, తక్షణమే స్పందించిన జిల్లా ఎస్పీ గారు సంబంధిత అధికారులతో మాట్లాడి పేపర్ పనులను పూర్తి చేపించి, మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు చివరి చూపు చూసేందుకు స్వగ్రామానికి రప్పించారు. మృతదేహం వెంట కువైట్ లో ఉన్న మృతుని భార్య చెన్నకేశవులమ్మ, మృతుని తమ్ముడు కంపా రమణలు స్వగ్రామం చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి దహన సంస్కారాలు పూర్తి చేశారు. *వివరాల్లోకి వెళితే....* ????సుండుపల్లి మండలం గడ్డమీదపల్లి ఎరుకల కాలనీకి చెందిన కంపా వీరాంజనేయులు కొన్ని సంవత్సరాల కిందట తన భార్య చెన్నకేశవులమ్మను తీసుకొని జీవనోపాధి నిమిత్తము కువైట్ కు వెళ్లారు, అక్కడే ఓ ఇంట్లో పని చేస్తూ ఉండేవారు, కంపా వీరాంజనేయులు డ్రైవర్ గా, వారి భార్య కువైట్ సేట్ ఇంట్లో పనిమనిషిగా ఒకే ఇంట్లో పని చేస్తూ.. రెండు సంవత్సరాలకు ఒకసారి స్వగ్రామానికి వస్తూ పోతూ ఉండేవారు, ఈ క్రమంలో కువైట్ సేటు పెద్ద కుమారుడుతో తన భర్త వీరాంజనేయులు బయటకు వెళ్లాడని ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదని, కువైట్ దేశంలో ఇండియా ఎంబసీలో వాలంటరీగా పనిచేస్తున్న పెనగలూరు మండలం కు చెందిన జిలకర మురళి గారితో కంపా చెన్నకేశవులమ్మ మాట్లాడగా.. ఆయన చుట్టుపక్కల వారిని విచారించి మీ భర్త చనిపోయాడని ఫార్మహి హాస్పిటల్ లో మృతదేహం ఉందని చెప్పాడని ఆవేదన చెందారు, ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు కంపా వీరాంజనేయులు మరణవార్త తెలియడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించాలని కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారిని కలిసి విన్నవించుకున్నారు, ఎస్పీ గారు వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని మృతదేహాన్ని ఇండియాకు రప్పించారు. ఎస్పీ గారు వెంటనే చొరవ తీసుకుని కంపా వీరాంజనేయులు మృతదేహాన్ని ఇండియాకు రప్పించినందుకు జిల్లా ఎస్పీ గారికి, జిల్లా పోలీసు శాఖకు ఎప్పటికీ రుణపడి ఉంటామని కంపా వీరాంజనేయులు కుటుంబ సభ్యులు జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకొని కృతజ్ఞతలు తెలియజేశారు.
Reporter
Namitha News