Thursday, 16 April 2026 06:42:08 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

స్వచ్ఛతాహి సేవకు సిద్ధం కావాలి - ఎంపీడీఓ సురేంద్రనాథ్

Date : 16 September 2024 09:52 PM Views : 294

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె సెప్టెంబర్ 16 : తంబళ్లపల్లె మండలం లో మంగళవారం నుండి అక్టోబర్1వ తేదీ వరకు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఎంపీడీవో సురేంద్రనాథ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 17న గ్రామపంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా, ఉపాధి సిబ్బంది విద్యార్థులతో కలిసి హ్యూమన్ చైన్ ఏర్పాటు, స్వచ్ఛత, పరిసరాల శుభ్రత పై ర్యాలీ చేయాలన్నారు. 18న గ్రామస్థాయిలో స్వచ్ఛత రన్, 19న అన్ని పంచాయతీ కార్యాలయాల్లో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ, 20న పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలలో తల్లి పేరుతో మొక్కలు నాటి సంరక్షించాలి. 21న మహిళా సంఘాలు, యువజన సంఘాలు క్యాంపెయిన్ ర్యాలీ తోపాటు శ్రమదానం చేయాలి. 22న విద్యుత్, తాగునీరు ఆదా, ప్లాస్టిక్ నిర్మూలన ఇతర పర్యావరణ అంశాలపై క్యాంపెయిన్ చేయాలి. 23న భూగర్భ జలాల అభివృద్ధికి వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు తనిఖీ పనిచేసేలా చూడాలి. 24న తాగునీటి వనరుల వద్ద శుభ్రం చేసి శ్రమదానం చేపట్టాలి. 25న స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన మహిళా సంఘాలకు ఉపాధి హామీ మేట్లతో చిన్న చిన్న ప్లే చేయించాలి. 26న పెరిగే టెక్నాలజీ, యాప్స్, లింక్స్ గాడ్జెట్స్ వాడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలి. 27న స్వచ్ఛతాహి భాగీరది పై గ్రామసభ. 28న చెత్త నుండి సంపద తయారీ కేంద్రం తో పాటు స్వచ్ఛ అసెట్స్ పై ప్రజలకు అవగాహన బ్యూటిఫికేషన్, వాల్ పెయింట్ తో పరిశుభ్రత నినాదాలు రాయించాలి. 30న జీవితంలో వాడిన ప్లాస్టిక్ ఇతర యూస్ అండ్ త్రో వస్తువులు తిరిగి ఉపయోగపడేలా ప్రజలకు ఉదాహరణంగా టెక్నిక్లు తెలియజేయుట. అక్టోబర్ 1న పంచాయతీ పరిధిలోని స్కూళ్లలో స్వచ్ఛతపై పిల్లల మనోభావాలు, ప్రదర్శనలో తెలియజేయుట, వ్యాసరచన నిర్వహణ, విద్యార్థులు ఇండ్లలో స్వచ్ఛతపై పెద్దలకు తెలిపే విధంగా తర్ఫీదు, పై కార్యక్రమాలన్నీ అధికారి యంత్రాంగం నిర్వహణకు అందరి సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమం నిర్వహణపై ప్రతిరోజు ఫోటోలు, వీడియో వాటిని తిరిగి యాప్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఎంపీడీవో తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :