నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 14 : మదనపల్లి పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మదనపల్లి మాజీ సైనికులు సంఘం అందరూ కలిసి ఆపరేషన్ సిందూర్, విజయవంతం కు స్ఫూర్తి గా హై స్కూల్ లో సైనికుని విగ్రహం ఏర్పాటు చేసిన విగ్రహం ను ఆవిష్కరణ చేసిన స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషా.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో సైనిక విగ్రహానికి సెల్యూట్ చేసి జాతీయగీతం ఆలాపించారు.కార్యక్రమం కు హాజరైన మాజీ సైనికులను దుశ్శలువాతో ఘనంగా సత్కరించారు. సైనికులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని అలాగే టౌన్ బ్యాంక్ కూడలిలో సైనికుల విగ్రహం ఏర్పాటుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Reporter
Namitha News