నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జూన్ 29న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ అర్జీలను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ , మదనపల్లి: ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి జూన్ 29 సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు జిల్లా కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తెలుసుకోవడానికి 1100 మీకోసం కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. అర్జీదారులు ముందుగా తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్ స్థాయి అధికారులకు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాని సమస్యలతో ఉన్నవారే జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Reporter
Namitha News