Saturday, 12 September 2026 12:58:06 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

మిట్స్ యూనివర్సిటీలో ఘనంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవ వేడుకలు

Date : 13 August 2026 09:22 PM Views : 94

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 13 : మదనపల్లె సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని సెంట్రల్ లైబ్రరీ వారి ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి.యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్ మరియు అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ జయంతి సందర్బంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పుస్తక పఠనంతో పాటు డిజిటల్ లైబ్రరీలు, ఈ-బుక్స్, ఆన్‌లైన్ జర్నల్స్, డిజిటల్ వనరులు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక వనరులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ పుస్తకాల ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదని, పుస్తకాలు మనిషికి శాశ్వత జ్ఞానాన్ని అందించే మార్గదర్శకాలుగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు ప్రత్యేక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ పుస్తక ప్రదర్శనలో ఇంజినీరింగ్,సైన్స్, టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, మేనేజ్‌మెంట్, పరిశోధన తదితర విభాగాలకు సంబంధించిన జాతీయ మరియు అంతర్జాతీయ వైలీ , ఓ’రైలీ , ఓరియంట్ బ్లాక్‌స్వాన్, సీబీఎస్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, స్ప్రింగర్ వంటి అనేక రకాల పుస్తకాలను ప్రదర్శించారు. పుస్తక ప్రదర్శనలో డాక్టర్ యెన్ గంగిశెట్టి, లైబ్రేరియన్ డాక్టర్ ఎమ్.సురేష్ బాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: