Wednesday, 29 July 2026 11:06:25 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఆగమన 2కె25 ఫ్రెషర్స్ డే

Date : 19 December 2025 06:04 PM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్ నందు ఆగమన 2కె25 ఫ్రెషర్స్ డే. కురబల కోట మండలం అంగళ్లకు సమీపము నందు ఉన్న విశ్వం ఇంజనీరింగ్ కాలేజీ నందు 2025 వ సంవత్సరం సెప్టెంబర్ నెల నందు మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులందరికీ రెండవ సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు 20-12-2025 తేదీ శనివారం రోజున ప్రెషర్స్ డే సెలబ్రేషన్స్ చేయుటకు సన్నాహాలు చేయుచున్నారు. ఈ కార్యక్రమమును ఆగమన చేస్తూ ఇంజనీరింగ్ చదువుతున్న మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి బ్యానర్ను ఆవిష్కరించారు. జూనియర్ మరియు సీనియర్ విద్యార్థులందరూ కలిసిమెలిసి నాలుగు సంవత్సరాలు చదవాల్సి ఉంటది కాబట్టి వారి మధ్య సానిహిత్య సంబంధాలు పెంపొందించుకొనుటకు వివిధ రకాల ఆటలు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులకు ఆగమన 2కె25 ప్రోగ్రామ్ నందు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమం నందు చీఫ్ గెస్ట్, గెస్ట్ ఆఫ్ హానర్ మరియు కాలేజ్ యాజమాన్యం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తదుపరి విద్యార్థులు వారి నైపుణ్యాలను ఫ్లాష్ మాబ్, స్కిట్ మరియు నృత్య కార్యక్రమాలు ప్రదర్శించవచ్చని డీన్ పబ్లిక్ రిలేషన్ పూజారి అంజప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమమునకు మొదటి మరియు రెండవ సంవత్సరం చదువుతున్న ప్రతి విద్యార్థి తప్పకుండా హాజరవ్వాలని ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :