Monday, 14 September 2026 08:06:08 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

టాప్ ఎమర్జింగ్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ లలో దేశవ్యాప్తంగా 11వ స్థానం లో మిట్స్

Date : 20 June 2026 07:45 PM Views : 150

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జూన్ 20 : మదనపల్లి సమీపం లోని అంగళ్ళు వద్ద నున్న మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రతిష్టాత్మక టైమ్స్ ఇంజినీరింగ్ ర్యాంకింగ్స్–2026లో జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపును పొందినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. దేశంలోని అత్యుత్తమ అభివృద్ధి చెందుతున్న ఇంజినీరింగ్ విద్యాసంస్థల (Top Emerging Engineering Institutes) విభాగంలో మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఆల్ ఇండియా 11వ ర్యాంకు సాధించడం విశ్వవిద్యాలయం విద్యా నాణ్యత, పరిశోధనా సామర్థ్యం మరియు పరిశ్రమలతో ఉన్న బలమైన అనుసంధానానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మొదలైన అత్యాధునిక రంగాల్లో ప్రపంచ స్థాయి విద్యను అందిస్తూ, విద్యార్థులకు భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను పెంపొందించడంలో మిట్స్ విశేష కృషి చేస్తోందన్నారు. నాణ్యమైన బోధన, వినూత్న పరిశోధనలు, ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాఠ్య ప్రణాళికలు, అత్యుత్తమ ప్లేస్‌మెంట్ అవకాశాలు మరియు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపారు. టైమ్స్ ఇంజినీరింగ్ ర్యాంకింగ్స్–2026లో సాధించిన ఈ గౌరవప్రదమైన స్థానం విశ్వవిద్యాలయం విద్యా ప్రగతి, పరిశోధనాభివృద్ధి మరియు నాణ్యమైన ఉన్నత విద్య పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వ్యవస్థాపకులు మరియు ఛాన్సలర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సలర్ నాదెళ్ల ద్వారకనాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి. యువరాజ్ ఈ విజయానికి కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులు మరియు పూర్వ విద్యార్థులను అభినందించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: