నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 30 ః అన్నమయ్య జిల్లా కలెక్టర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ద్విత్వ తుఫాను కారణంగా సోమవారం మండలంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు ఎంఈఓ త్యాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వర్షాల కారణంగా విద్యుత్తు పట్ల జాగ్రత్తలు పాటించాలని, పిల్లలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు, నీటి పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, తడిసిన మరియు పాడుపడిన గోడల వద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తల్లిదండ్రుల ద్వారా సందేశం పంపాలని సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు
Reporter
Namitha News