Sunday, 13 September 2026 11:08:11 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో డెవ్ ఒప్స్ జర్నీ ఆన్ క్లౌడ్ ఏ. డబ్ల్యూ.ఎస్ పై వర్క్ షాప్

ముఖ్య అతిధిగా వింగ్స్ టెక్నాలజిస్ కార్పొరేట్ ఐ.టి ట్రైనర్ స్లిటోన్ జార్జ్ పాల్

Date : 01 December 2025 06:38 PM Views : 260

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 01 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం వారు డేవ్ఒప్స్ జర్నీ ఆన్ క్లౌడ్ ఏ.డబ్ల్యూ.ఎస్ అనే అంశం పై వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి లోని వింగ్స్ టెక్నాలజీస్, కార్పొరేట్ ఐ.టి ట్రైనర్ స్లీటోన్ జార్జ్ పాల్. ఎ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక రంగంలో వేగంగా మారుతున్న క్లౌడ్ టెక్నాలజీలను అర్థం చేసుకొని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల టూల్స్ వినియోగం, డేటా సెక్యూరిటీ మరియు బ్యాకప్ సదుపాయాలు, పరిశోధన మరియు కొత్త ఆవిష్కరణలకు మద్దతు వంటి ప్రయోజనాలు క్లౌడ్ టెక్నాలజీ అందిస్తున్నాయని అన్నారు. ఈ శిక్షణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, క్లౌడ్ సర్వీసులు, డేవ్ఒప్స్ టూల్స్, ఆటోమేషన్ ప్రాసెస్, సెక్యూరిటీ మరియు ఇంటిగ్రేషన్ వంటి ముఖ్య అంశాలపై నిపుణులు ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించారు. క్లౌడ్ ఆధారిత అప్లికేషన్ల అభివృద్ధి, డిప్లాయ్‌మెంట్, మానిటరింగ్ పద్ధతులపై విద్యార్థులు అవగాహనా పెంచుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఆధునిక ఐటీ పరిశ్రమలో అత్యంత అవసరమైన డేవ్ఒప్స్, ఏ.డబ్ల్యూ.ఎస్, అజురే, గూగుల్ క్లౌడ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లపై నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్ ఉద్యోగావకాశాలకు మరింత సిద్ధమవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎన్.నవీన్ కుమార్, కోఆర్డినేటర్ ఎన్.నిర్మల దేవి, డాక్టర్ శివరాజ్.సి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: