నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 11 ః తంబళ్లపల్లె ఐకెపి కార్యాలయంలో గురువారం ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏపీఎం గంగాధర్ సహకారంతో మహిళా సంఘాలకు డాక్యుమెంటేషన్ చేసి ప్రతి సభ్యురాలు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధికి బంగారు బాటలు వేసుకోవాలన్నారు. ప్రతి సభ్యురాలు రుణం పొందడంతో పాటు చెల్లింపులు సైతం సకాలంలో చెల్లించి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఏపీఎం గంగాధర్ కోరారు. ఈ కార్యక్రమంలో సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, భాష, సంఘ మిత్రలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News