నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఆగస్ట్ 8 : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు భాగంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని టిడిపి నాయకులు శివారెడ్డి అన్నారు. శుక్రవారం మూగవాడి పంచాయతీ ఎర్రప్పల్లె, గొల్లపల్లె గ్రామాల్లో సుపరి పాలన అభివృద్ధి పనులు పైముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళల కోసం ఉచిత బస్ పథకం ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. తల్లికి వందనం పథకంకింద విద్యార్థులకు 15 వేలు ఇవ్వడం జరిగిందన్నారు. రైతులకు సహాయనిధి 7000రూపాయలు జమచేశారని ఆయన తెలిపారు.సుపరిపాలన కార్యక్రములో పాల్గొన్నా టిడిపి నాయకులు శివారెడ్డి, చిన్నానంద గౌడ బాబుసాబ్ , అజారుద్దీన్ టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు .
Admin
Namitha News