నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఘనంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు - కష్టకాలంలో పార్టీ కి అండగా నిలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి - రాజంపేట పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి క్రాస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం పుట్టినరోజు ను పురస్కరించుకొని కేక్ కట్ చేసి కిషోర్ కుమార్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి కేక్ తినిపించారు. ఈ సందర్భంగా అర్జె వెంకటేష్ మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కిషోర్ కుమార్ రెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడని, అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్ధకమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ధైర్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడని కొనియాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాటి నుండి నల్లారి కుటుంబం మచ్చలేని కుటుంబమని నల్లారి అమర్నాథ్ రెడ్డి మంత్రిగా, ఈ జిల్లా రాజకీయాలను శాసించారని, ఆయన సోదరులు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ముఖ్యమంత్రిగా రాణించారని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అరాచకాలను ఎండగట్టడంలో పెద్దిరెడ్డి వ్యతిరేకల్ని ఏకం చేయడంలో కిషోర్ కుమార్ రెడ్డి పాత్ర మరువ లేనిదని కొనియాడారు. తంబళ్లపల్లి నియోజక వర్గం లో వైసిపి ఆగడాలను చెక్ పెట్టిన వ్యక్తి కిషోర్ కుమార్ రెడ్డి అని అధికారంలో లేనప్పుడు ధైర్యంగా ఆ నియోజకవర్గం లో పర్యటించడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కార్యకర్తలకు మనోధైర్యం నింపారని, పీలేరు నియోజకవర్గంలో మహిళ పాలిటెక్నిక్ కళాశాల స్థలం కబ్జా కాకుండా ధైర్యంగా ధర్నాలు చేశారని, పీలేరులో అనేక భూ కుంభకోణాలను బయట పెట్టారని అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి దిశా దశ నిర్దేశకులని పేర్కొన్నారు. కష్టకాలంలో అండగా ఉన్న కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీ ప్రభుత్వంలో మంచి పదవి ఇచ్చి గౌరవించాలని ముఖ్యమంత్రి కి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడు వారి కుటుంబానికి ఆయు రారోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందే విధంగా ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్వర్ భాష, రామచంద్ర నాయుడు, మహేష్ రెడ్డి, నరసింహారెడ్డి, మల్లికార్జున, వేణు, శివకృష్ణ, శివారెడ్డి, గండికోట గణేష్, విద్యాసాగర్ లు పాల్గొన్నారు.
Reporter
Namitha News