నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి ఎఫ్.ఏ.సి తాసిల్దార్ గా చేపట్టిన డిటి తపస్వని నిమ్మనపల్లె మండల తహసీల్దార్ కార్యాలయం కు బదిలీ పై వచ్చిన తపస్విని బాధ్యతలు చేపట్టారు.. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆర్.ఐ రాంప్రసాద్ , ఈ సర్వే డీటి సిరాజుద్దీన్, మండల సర్వేయర్ గోపీనాథ్, వీఆర్వోలు సచివాలయ సిబ్బంది, చౌక దుకాణ డీలర్లు తాసిల్దార్ కు ఘన స్వాగతం పలికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా తాసిల్దార్ తపస్విని మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కురబలకోట మండలం నుండి నిమ్మనపల్లె మండల తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం బాధ్యతలు చేపట్టడం జరిగిందని, మండలంలో రెవెన్యూ భూ సమస్యలపై ప్రజలతో అన్యున్నతంగా ప్రవర్తిస్తూ సకాలంలో వారి సమస్యలను పరిష్కరిస్తానని, ఆఫీసు పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు, ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఆర్ఐ రమేష్, సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి, వీఆర్వోలు శాంత కుమార్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రెడ్డి రాణి, నాగరాజు, సుధాకర రెడ్డి, కృష్ణప్ప, శ్రీనివాసులు, ప్రవీణ్ కుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....
Reporter
Namitha News