నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట: చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే మాకు శిరోధార్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు,అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తీసుకున్న నిర్ణయం మాకు శిరోధార్యం రాష్ట్ర భవిష్యత్తు కోసం టిడిపి జనసేన పొత్తుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వివిధ రకాల అభిప్రాయాల సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది ఎన్నికలలో టికెట్ కోసం ఎంతోమంది ఆశావహులు పార్టీలోపనిచేసినవారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నవారు కొత్తవారు ప్రయత్నాలు చేసినప్పటికీ టికెట్ ఇస్తే గెలవగలరు అనే ఒక్కరికే టికెట్ లభిస్తుంది తంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంతోమందికి వివిధ రకాల రాజకీయ పదవులు కల్పించి గుర్తింపు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేసిన తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డి గారిని మెజారిటీతో గెలిపించడానికి నావంతుగా కృషి చేస్తానని ఆమె అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంయమనం పాటించి జనసేన నాయకులతో కలిసి వైసిపి అరాచక పాలనను అంతం చేయడానికి ఐక్యమత్యంగా జయచంద్ర రెడ్డి గారిని గెలిపించడానికి పోరాడవలసిన అవసరం ఉంది భేషజాలు వీడి అనవసరమైన పుకార్లు నమ్మకుండా పార్టీ మనకు యిచ్చిన గుర్తింపుని గురుతర బాధ్యతగా భావించి మన భవిష్యత్తు తరాల గురించి కలిసి పనిచేసి తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని గెలిపించుకుందాం రాష్ట్రవ్యాప్తంగా టిడిపి జనసేన సంయుక్త ప్రభుత్వ ఏర్పాటు కావాలని వైసిపిని ప్రజలు ఓడించి చంద్రబాబు నాయుడు గారిని సీఎంను చేయడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో షఫీఉల్లా శత్రుజ్ఞ శ్రీనివాసులు పద్మనాభ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News