నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 15 : మదనపల్లె సమీపం లోని అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగము వారు జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమము కు ముఖ్య అతిథిగా డి.దీపక్ సింగ్ , సైంటిస్ట్-D , సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (CMTI), బెంగళూరు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవర్ గ్రీన్ అని, కోర్ జాబ్స్ చేసే వారికి కెరీర్ గ్రోత్ బాగుంటుంది అని అన్నారు. సి.ఎమ్.టి.ఐ సంస్థ నందు ఇంజినీరింగ్ విద్యార్థులకు లభించే ఉద్యోగ అవకాశాలపై వివరించారు. మెకానికల్, ప్రొడక్షన్, మెటలర్జీ, మెకాట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాలకు చెందిన విద్యార్థులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ ఫెలో వంటి పోస్టుల ద్వారా కెరీర్‌ను ప్రారంభించవచ్చని తెలిపారు. అలాగే సి యెన్ సి మెషినింగ్, రోబోటిక్స్, ఇండస్ట్రీ 4.0 మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలను వివరిస్తూ, విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సూచించారు. గేట్ వంటి పరీక్షల ద్వారా లేదా నేరుగా నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడం ద్వారా సి.ఎమ్.టి.ఐ సంస్థ లో అవకాశాలు పొందవచ్చని తెలిపారు. అదనంగా ఇంటర్న్‌షిప్‌లు, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాజెక్ట్ వర్క్ ద్వారా అనుభవాన్ని పెంపొందించుకోవడం అవసరమని, టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు టీమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్, అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ , కో ఆర్డినేటర్స్ డాక్టర్ గజేందిరన్, డాక్టర్ ఏ.పృథ్వి దీప్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News