నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 03 ః తంబళ్లపల్లె మండలం గోపి దిన్నె పంచాయితీ వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడుగా మల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర తెలిపారు. మంగళవారం ఎన్నికల అబ్జర్వర్ ఉమాపతి రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా మల్రెడ్డిని నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన ఎన్నికపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలకు మల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్యామలా కోటిరెడ్డి, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, శివారెడ్డి, రఘురాం రెడ్డి, శివరాంరెడ్డి, రామస్వామి రెడ్డి, వీరాంజనేయరెడ్డి, పెద్దిరెడ్డి, రమేష్ రెడ్డి,అశోక్ రెడ్డి, శ్రీనివాసులు, మల్లికార్జున, విజయ్ కుమార్, ఆనంద్, ప్రభాకర్ రెడ్డి, శివారెడ్డి, భాస్కర్ రెడ్డి, చిన్నపరెడ్డి, ఆనంద్ రెడ్డి, శేఖర్ రెడ్డి, దొరస్వామి నాయక్, కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News