Sunday, 13 September 2026 02:48:09 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్

Date : 28 February 2026 08:56 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 28 : మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ కి వినతిపత్రం అందచేసినట్లు ఆయన వివరించారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు, సంస్థలు మరియు రాజకీయ పార్టీలు నిరసనలు తెలపడం ఒక రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. మదనపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ట్రాఫిక్ సమస్యలు పెరిగాయని, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని దీనిని సీపీఎం తరఫున ఖండిస్తున్నట్లు తెలిపారు. నిరసనకారులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మదనపల్లి పట్టణంలో ఒక ప్రత్యేక 'ధర్నా చౌక్'ను ఏర్పాటు చేయాల్సిన భాద్యత పోలీసులది కాదా అని ప్రశ్నించారు. ​పోలీసులు మున్సిపల్, రెవిన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ధర్నా చౌక్ ఏర్పాటు చెయ్యాలని కోరారు. చిత్తూరు బస్టాండ్ వద్ద ఉన్న ఖాళీ స్థలం ధర్నా చౌక్‌కు అనువుగా ఉంటుందని పార్టీ తరపున ప్రతిపాదిస్తున్నట్లు వివరించారు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :