నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 5 : కుక్కల దాడిలో గాయపడిన జింకను పశువైద్య సిబ్బంది ఆదుకున్న సంఘటన మండలంలో వెలుగు చూసింది. మండల శివార్లలోని బండ్రేవు-తంబళ్లపల్లె రహదారి వద్ద ఓ జింక కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజారామ్ మరియు సిబ్బంది తంబళ్లపల్లె పశువైద్యురాలు ఇందు కు తెలియజేశారు, ఆమె తన సిబ్బంది తో జింక కు ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్సల కోసం మదనపల్లి పశువైద్య కేంద్రానికి తరలించడానికి సహకరించింది. సకాలంలో జింకకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన వైద్యురాలు ఇందు, ఫారెస్ట్ అధికారి రాజారాం సిబ్బందికి గోపి దిన్ని నల్లగుండ్ల మల్లికార్జున రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News