నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి: బ్యూరో: నమిత న్యూస్ :ఫిబ్రవరి 23:- మసీదు స్థలాన్ని పూర్తిగా షాహి జామియా మసీదు కమిటీ కి స్వాధీన పరచాలని జామియా మసీదు కమిటీ మాజీ అధ్యక్షుడు, సివిల్ రైట్ యాక్టివ్విస్ట్ డాక్టర్. హుస్సేని అన్నారు. శుక్రవారం రెండవ రోజు స్థానిక జామియా మసీద్ మినార్ ఎదురుగా మసీదు స్థలం కోసం మరి కొంత మంది ముస్లిం మైనార్టీ పెద్దలతో కలిసి ఆయన నిరాహార దీక్షలు చేపట్టారు. మొత్తం 12.5 ఎకరాల జామియా మసీదు స్థలంలో 4 ఎకరాల స్థలాన్ని కమిటీ కి కేటాయిస్తామని గతంలో మైనార్టీలకు ఒక ముఖ్యమంత్రి మాట ఇచ్చి మడమ తిప్పారని, మరో ముఖ్యమంత్రి మాటిచ్చి మరిచారని, మరో ఇంకో ముఖ్యమంత్రి కనుమరుగయ్యారని ఆయన అన్నారు.ఎన్నికల సమయంలో మైనార్టీల ఓట్లు దండుకొని నాయకులు వివిధ హోదాలను అనుభవిస్తూ మైనార్టీల సహాయాన్ని మర్చిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మా మసీదు స్థలం మాకు అప్పగించేంతవరకు నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. మైనార్టీలకు మద్దతు ప్రకటించిన నాయకులకే ముస్లిం ల మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. జామియా మసీదు స్థలాన్ని స్వాధీన పరుస్తామని అధికార ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం చేశారని ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. అధికారం కోసం రాజకీయ పార్టీ నాయకులు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారని అధికారం ఏర్పడిన తర్వాత జామియా స్థలము ఊసే లేకుండా పోతుందనిఆయన మండిపడ్డారు. రాయచోటి సబ్ డివిజన్ అయిన తర్వాత జామియా మసీదు స్థలం 5 ఎకరాల 50 సెంట్లు ప్రభుత్వ కళాశాల నుండి బదిలీ తర్వాత ఆ స్థలం కొలతలు వేసి స్వాధీన పరుస్తామని చెప్పి మాటలకే పరిమితం చేశారని మండిపడ్డారు. అధికార ప్రభుత్వం జామియా మసీదు స్థలాన్నిఅప్పగించేంతవరకునిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. ఈకార్యక్రమంలో ముస్లిం మత గురువు సర్కాజీ షర్ఫుద్దీన్, షాహి జాబియాన మసీద్ కమిటీ మాజీ అధ్యక్షులు ఆర్ట్విస్ట్ అజిజుర్ రెహ్మాన్, ఖదీర్, సలాం, తాలిబ్ అలీఖాన్ డాక్టర్ హుస్సేని కార్యదర్శి ఆజిజ్యూర్ రెహమాన్ డాక్టర్ ఖదీర్ హుస్సేన్ ఏ అజిచూర్ రెహమాన్ కే ఖదీర్ తల్లబ్బో అలీ ఖాన్ రాయచోటి డ్రైవర్స్ ఓనర్స్ స్టాండ్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు
Reporter
Namitha News