Thursday, 30 July 2026 08:27:17 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సైబర్ నేరాలపై పట్ల అప్రమత్తంగా ఉండాలి - యస్.ఐ. రమేష్ బాబు

Date : 02 December 2025 07:10 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 02 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని మేజర్ పంచాయతీ చెంబకూరు గ్రామం లో మంగళవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు చెంబకూరు గ్రామంలో పర్యటించి స్థానికులతో నేరుగా ముచ్చటించి వివిధ నేరాలపై భద్రత ప్రమాణాలపై లోతైన అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై రమేష్ బాబు . ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ పెరుగుతున్న సైబర్ మోసాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరచితుల కాల్స్ కు స్పందించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.సోషల్ మీడియా ఫేస్ బుక్, ఇన్స్ట్రాగ్రామ్,కు యువత ఎక్కువగా బానిసలుగా అవుతున్నారని తల్లి దండ్రులు వారిపై ఒక కన్ను వేసివుంచాలని పిల్లలు ఎవరి ఎవరికీ కాల్ చేస్తున్నారా, చాటింగ్ చేస్తున్నారా, ఆన్ లైన్ గేమ్ లు ఆడుతున్నార అని ఫోన్ చెక్ చేయాలని, ఫోన్ లాక్ ఎందుకు పెడుతున్నావని కుటుంబ సభ్యులను అడగాలన్నారు. మొబైల్ బెట్టింగ్ వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయని వాటి జోలికి వెళ్ళకండన్నారు. గ్రామంలో ఎవరైనా అపరిచితులు సంచారం చేయడం, దొంగతనాలకు ఆస్కారం ఉంటుందని, అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అపరిచితుల నుండి బెదిరింపులు కాల్స్ రాగానే వారి ఫోటో సెల్ తో తీసి పోలీసులకు తెలియజేయాలన్నారు. సైబర్ క్రైమ్ పట్ల గ్రామీణ ప్రజలకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.ప్రతివాహన దారులు మద్యం సేవించి నడపరాదని హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించు కోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై డి. రమేష్ బాబు పోలీస్ సిబ్బంది రాజేష్, ఖాజాఫీర్, మహిళా పోలీస్ చందన, సీనియర్ టిడిపినాయకులు తిప్పన్న, రాంమూర్తి, నిసార్,ఫ్రూప్ట్స్ ఉస్మాన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: