Sunday, 13 September 2026 05:40:04 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

సోలార్ విద్యుత్తు భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఆదాయ వనరులే - విద్యుత్ ఏ.డి. గోవిందరెడ్డి

Date : 14 June 2026 08:56 PM Views : 120

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 14 ః కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్తు కనెక్షన్ తీసుకుంటే భవిష్యత్తులో విద్యుత్ ఆదాతో పాటు ప్రతి కుటుంబానికి సోలార్ ఓ ఆదాయ వనరుగా మారుతుందని విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన ఏఈ సురేంద్ర తో కలిసి తంబళ్లపల్లె, గోపిదిన్నె సబ్ స్టేషన్లు పరిశీలించి విద్యుత్తు సరఫరాపై ఆరాతీశారు. వర్షాకాలం దృశ్య విద్యుత్ లైన్లు పై ట్రీ కటింగ్ చేపట్టి విద్యుత్ సమస్యలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు , రైతుల విద్యుత్ మోటార్ల వద్ద విద్యుత్ సరఫరా పై ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎ.డి తంబళ్లపల్లె, ఇట్నేని వారి పల్లి తో పాటు పలు చోట్ల సోలార్ విద్యుత్ యూనిట్లను పరిశీలించారు.సోలార్ లబ్ధిదారులు సోలార్ తో నిరంతర విద్యుత్ పొందడం తోపాటు బిల్లులు చెల్లించే పని లేకుండా మాకు అదనంగా డబ్బు ఆదా అవుతున్నట్లు చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ఏ.డి మాట్లాడుతూ మండలంలో విద్యుత్ శాఖ సిబ్బంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని తద్వారా వారికి లభించే లబ్ధిపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యుత్ బిల్లులు సకాలంలో వసూళ్లపై సిబ్బంది దృష్టి సారించాలని విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో రైతులు, కక్షిదారులు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ శంకర్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: