Sunday, 13 September 2026 07:40:07 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తంబళ్లపల్లె తాగునీటి సమస్యల పరిష్కారానికి పెద్దపీట - జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు

Date : 08 May 2026 09:42 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 8 ః తంబళ్లపల్లె నియోజకవర్గం లోని తాగునీటి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు చిత్తూరు జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలోని కురబలకోట, బి కొత్తకోట, పీటీఎం, మొలకల చెరువు, తంబళ్లపల్లె మండలాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకుల తో సమీక్షలు జరిపి ఆయా మండలాలలో తాగునీటి సమస్యలపై ఆరా తీశారు. మండల్ పరిషత్, జిల్లా పరిషత్ నిధులు తాగునీటి సమస్యలకు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వేసవిలో తాగునీటి సమస్యలను అధిగమించి ముందస్తుగా మండల స్థాయి నుండి పంచాయితీ సచివాలయ వ్యవస్థ నుండి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారంలో మండల పరిషత్ అధికారులతో పాటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అప్రమత్తంగా ఉండి పరిష్కరించగలిగామన్నారు. ఎక్కడైనా తాగునీటి సమస్య అధికారుల దృష్టికి వస్తే 24 గంటల లోపు పరిష్కారానికి ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా పారిశుద్ధ్యం మెరుగుకు స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా అవగాహన పెంచడంతోపాటు స్వచ్ఛరథం నిర్వహణతో మారుమూల గ్రామాలలోని చెత్త సేకరణ కు వస్తు రూపేనా చెల్లింపు కార్యక్రమం విజయవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు బురుజు లో పైప్ లైన్ సమస్య, తంబళ్లపల్లెలో మహిళలకు మరుగుదొడ్లు నిర్మాణాలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులు నాణ్యత లోపం లేకుండా చూడాలని లేనిపక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మల్లయ్య కొండ కింద మండల నిధులతో నిర్మించిన సిసి రోడ్డు పరిశీలించారు. ఆయన వెంట డి ఎల్ డి ఓ లక్ష్మీపతి,ఇన్చార్జ్ ఎంపీడీవో ఎం.వి ప్రసాద్, ఏవో థామస్ రాజా, ఏఈ వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, బేరిశ్రీనివాసులు, పురుషోత్తం, కాలా నారాయణ, దండు వెంకటరమణ,సోమశేఖర్, సురేంద్ర, రామచంద్ర, ఎంపీటీసీలు, వైకాపా నాయకులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: