నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : జాతీయ కరాటే పోటీల్లో నిమ్మనపల్లి విద్యార్థుల ప్రతిభ - కవల విద్యార్థులు బెన్షిక, బెన్షిక్‌కు ద్వితీయ స్థానం నిమ్మనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (తెలుగు)లో 8వ తరగతి చదువుతున్న కవల విద్యార్థులు మనేరి బెన్షిక, మనేరి బెన్షిక్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో ప్రతిభ చాటారు. గత నెల 26న బెంగళూరులో నిర్వహించిన 14 సంవత్సరాల విభాగం జాతీయ కరాటే (కటా) పోటీల్లో ఇద్దరు ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు, గ్రామానికి గౌరవం తీసుకొచ్చారు. విద్యార్థుల ఈ విజయంపై వారి తల్లిదండ్రులు మనేరి శివశంకర్, జయలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం కవల విద్యార్థులకు పాఠశాలలు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజాద్ అలీఖాన్ విద్యార్థులను అభినందిస్తూ, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సోదరులు ఇద్దరు ద్వితీయ స్థానం సాధించడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీనివాసులు, శారద, వెంకటగోపాల్, సతీష్, రెడ్డిశేఖర్, రమనప్ప, జయశ్రీ, గృహలక్ష్మి, రాజేంద్ర తదితరులు విద్యార్థులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఫోటో ఉంది 2:- విద్యార్థులను అభినందిస్తున్న పాఠశాల హెచ్ఎం అంజాద్ అలీ ఖాన్ ఉపాధ్యాయ బృందం.
Reporter
Namitha News