నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రజా చేరువ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రులు - ఘనస్వాగతం పలికిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లె : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ప్రజా చేరువ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం రాష్ట్ర మంత్రులు రాయచోటికి విచ్చేశారు.జిల్లా ఇన్‌చార్జి,రోడ్లు-భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితరులకు ఘన స్వాగతం లభించింది.ఈ సందర్భంగా రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లా పోలీసు శాఖ తరపున ఎస్పీ మంత్రులకు పూలమొక్కలు బహుకరించి,సాదరంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మంత్రుల సహకారంతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని,గతంతో పోల్చుకుంటే జిల్లాలో నేరాల శాతం తగ్గిందన్నారు.
Reporter
Namitha News