Sunday, 13 September 2026 07:09:57 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

రెండవ రోజూ కొనసాగిన సిపిఐ పాదయాత్ర

పలు సమస్యలు తెలియజేసిన పట్టణ ప్రజలు

Date : 07 August 2026 07:45 PM Views : 130

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఆగస్ట్ 07: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బీ.కొత్తకోట పట్టణంలో ప్రజా సమస్యలపై చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం రెండవ రోజు దిగ్విజయంగా సాగింది. శుక్రవారం బీసీ కాలనీ, బెంగళూరురోడ్,మగ్గాల వీధి,బిలాల్ మసీదు వీధి,చర్చివీధులలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ కొనసాగిన పాదయాత్రకు ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుండి విశేష స్పందన వచ్చింది.పలు సమస్యలను సిపిఐ నాయకులకు తెలియజేశారు.సదరు సమస్యలు సాధన కోసం సిపిఐ నిరంతరం శ్రమిస్తుందని పాదయాత్ర బృందం ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప, నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ;పట్టణంలోని ప్రజానీకం అనేక సమస్యలను తమకు వివరించారని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధి చూపడం లేదని,అలాగే పక్కాఇండ్లు,పింఛన్లు తమకు మంజూరు కాలేదని చెప్పారని అన్నారు.అలాగే కొందరు మహిళలు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు,వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెంచేశారని, వీటికి తోడు కరెంటు చార్జీలు,ఇంటి పన్నులు పెంపు కూడా చాలా దారుణమని ఆవేదన చెందారని వారన్నారు.సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే పోరాటాలే మార్గమని, సిపిఐ చేపట్టిపోయే పోరాటాలలో యువకులు,మహిళలు కార్మికులు,కర్షకులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎస్.బషీర్ ఖాన్,మండల కార్యదర్శి జి.రఘునాథ్,పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్అల్లి,మండల నాయకులు హెచ్.షమీవుల్లా,బి.వేణుగోపాల్ రెడ్డి,ఎం.గంగులప్ప,పి.రామచంద్ర,బాబాజాన్,షాకీర్,షఫీ,రియాజ్,కాటమరాయుడు,గంగులప్ప తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: