నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా బిజెపి కార్యదర్శిగా బర్నేపల్లి రవికుమార్ - నిస్వార్ధమైన సేవలకు లభించిన గుర్తింపు - ఘనంగా సన్మానించిన చల్లపల్లె,ముంటిమండుగు నగేష్ మదనపల్లె : భారతీయ జనతా పార్టీలో నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న ఓ నాయకునికి పదోన్నతి లభించింది.మదనపల్లి పట్టణానికి చెందిన బర్నేపల్లి రవికుమార్ అన్నమయ్య జిల్లా బిజెపి కార్యదర్శిగా నియమితులయ్యారు.ఈ మేరకు ఆదివారం రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్,అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.తొలుత ఏబీవీపీ కార్యకర్తగా రవికుమార్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.ఏబీవీపీ కార్యకర్తగా ఉంటూ బిజెపి బలోపేతం కోసం తీవ్రంగా శ్రమించారు.ఇతని సేవలను గుర్తిస్తూ బిజెపి అధిష్టానం మదనపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగి పట్టణంలో బిజెపిని బలోపేతానికి కృషి చేశారు.తదనంతరం బిజెపి పట్టణ అధ్యక్షులుగా అవకాశం కల్పించారు.రవికుమార్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మదనపల్లి పట్టణంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి బిజెపి బలోపేతానికి అలుపెరుగని కృషి చేశారని కొనియాడారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనను ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగారు.తర్వాత రెండో పర్యాయం కూడా బిజెపి పట్టణ అధ్యక్షులుగా ఆయనకు అవకాశం కల్పించారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండోసారి,మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు.అంతకుముందు 2014లో రాజంపేట పార్లమెంటు ఎంపీ స్థానానికి బిజెపి తరఫున పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి,మదనపల్లి నియోజకవర్గం నుండి బిజెపి తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన చల్లపల్లి నరసింహారెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.ఎక్కడ అవినీతి మచ్చ లేకుండా పార్టీకి నిజాయితీగా సేవలు అందించారు.ఎప్పుడు కూడా బిజెపిని అడ్డుపెట్టుకొని పైరవీలు చేయకుండా నిబద్ధతతో పనిచేశారు.2024 ఎన్నికల్లో రాజంపేట ఎంపీ స్థానానికి బిజెపి తరఫున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కూడా చివరి వరకు ప్రయత్నించారు.ఇలా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న బర్నేపల్లి రవికుమార్ సేవలను గుర్తిస్తూ రాజకీయంగా పదోన్నతి కల్పించారు.ఈ నేపథ్యంలో సోమవారం మదనపల్లి పట్టణంలోని విజయభారతి పాఠశాలలో రవికుమార్ ను బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి,ఆర్యవైశ్య సంఘం నాయకులు నగేష్,శివప్రసాద్ తదితరులు ఘనంగా సన్మానించి భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.
Reporter
Namitha News