Sunday, 13 September 2026 09:57:47 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 28 June 2026 06:04 PM Views : 102

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి: అన్నమయ్య జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీ సచివాలయం వద్ద నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మీనరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎంఎస్‌ఓతో కలిసి పలువురు చిన్నారులకు ఎమ్మెల్యే పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తూ, పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఆదివారం, సోమవారం, మంగళవారం మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని వారు సోమవారం లేదా మంగళవారం తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు నాయుడు, మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డి, బాలమాది శేఖర్, శ్రీనాథ్, జేసీబీ వేణు, అనంత, టీబీ విభాగ అధికారి ప్రభాకర్, సచివాలయ సిబ్బంది, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :