నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ధాత్రి ఆనంద నిలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు... - ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా - ఘనస్వాగతం పలికిన డాక్టర్ స్వాతి చక్రపాణి ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఆనంద నిలయం వృద్ధాశ్రమం నందు బుధవారం సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ సంబరాలకు మదనపల్లి శాసనసభ్యులు ఎం.షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.ముందుగా భోగి మంటతో కార్యక్రమాన్ని ప్రారంభించి,వృద్ధులతో ఆనందంగా గడిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పర్వదినాలు భారతదేశ సంస్కృతి,సాంప్రదాయాల విశిష్టతను చాటుతున్నాయన్నారు.ముఖ్యంగా ధాత్రి ఆనంద నిలయంలో అన్ని పర్వదినాల నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.ఆనంద నిలయం అలసిన వృద్ధ జీవితాల ప్రేమాలయమని,వ్యవస్థాపకులు స్వాతి చక్రపాణి చూపిస్తున్న ఆప్యాయత వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.హిందూ పర్వదినాలలో సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైందన్నారు.మూడు రోజులపాటు భోగి,మకర సంక్రాతి,కనుమలను నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు.వృద్ధుల ఆలనా పాలన చూస్తున్న స్వాతి చక్రపాణి సేవలను ప్రశంసించారు.భవిష్యత్తులో ఆనంద నిలయం అభివృద్ధికి తనవంతు సహాయ,సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం స్వాతి చక్రపాణి మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు సంక్రాంతికి సంబరాలకు హాజరైన ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.దాతల సహకారంతో ధాత్రి ఫౌండేషన్,ఆనంద నిలయం ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని,ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు.తమ సంస్థ సేవా కార్యక్రమాలలో దాతలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నవీన్ చౌదరి,టిడిపి పట్టణ ఉపాధ్యక్షులు యర్రబల్లి వెంకటరమణారెడ్డి,టిడిపి కోళ్లబైలు ఇంచార్జి రాటకొండ శ్రీనివాసులు నాయుడు,33వ వార్డు ఇంచార్జి రామిశెట్టి కృష్ణ (కమలామర్రి),డి.రమేష్ రెడ్డి,కత్తి లక్ష్మన్న,చుక్కా విజయ్ కుమార్,నాగమణి,లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు మురళి,ఉపాధ్యాయుడు బి.వి.రమణ మరియు ఆనంద నిలయం సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News