నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి 17 ః వేసవి ప్రభావంతో ఎంపీడీవో కార్యాలయంలో ఎండుతున్న చెట్లకు తెలుగుదేశం పార్టీ యువనేత అన్నగారి పల్లి బాలాజీ నీరందించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. కార్యాలయానికి వచ్చే వందలాదిమంది చెట్ల నీడ లేక ఇబ్బంది పడుతున్న సమస్యను గుర్తించడం బాలాజీ వెంటనే సొంత నిధులతో ట్యాంకర్లతో నీటిని తెప్పించి చెట్లకు అందించాడు. ఈ విషయమై ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి, ఏవో థామస్ రాజా, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ విజయ్, టైపిస్ట్ సురేంద్ర, లతో పాటు టిడిపి నాయకులు మండల ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, వీరాంజనేయులు, పురుషోత్తం, సుధాకర్ రెడ్డి, పంచాలమర్రి మాజీ సర్పంచ్ శంకర, కొటాల ఉప సర్పంచ్ రాజన్న, భాషా, సామిరెడ్డి, కన్నెమడుగు సురేంద్ర, నరేంద్ర నాయుడు, జగదీష్, రామాంజులు, ఖయూంలు బాలాజీని ప్రశంసించారు.
Reporter
Namitha News