నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు -జూలై 27: నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో భార్యను అతికిరాతకంగా కత్తితో గాయపరచడంతో తీవ్ర గాయాలతో ప్రాణాపాయస్థితిలో నెల్లూరులో చికిత్స పొందుతున్న బాధిత మహిళ షేక్ సుల్తానా అనే మహిళ వైద్య సేవల కోసం స్పందించి మానవత్వాన్ని చాటుకున్న ఆత్మకూరు పట్టణవాసులు.. తీవ్ర గాయాలతో నెల్లూరు నారాయణ వైద్యశాలలో చికిత్స పొందుతున్న షేక్ సుల్తానా అనే మహిళకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.. పూర్తి వివరాలు ఈ విధంగా దగదర్తి మండలం తడకలూరు ప్రాంతంలో నివసిస్తున్న మున్వర్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానం పెంచుకొని తరచూ వేధిస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో గత శనివారం తన భార్య సుల్తానా కళ్ళల్లో కారం కొట్టి విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించడంతో శరీరమంతా తీవ్ర గాయాలతో సుల్తానా నెల్లూరు నారాయణ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉంది.. సుల్తానా కు వరసకు సోదరడైన ఆత్మకూరుకు చెందిన ఓ యువకుడు ఆత్మకూరులోని తమ సన్నిహితుల వద్ద తమ సోదరి పరిస్థితిని చెప్పుకొని బాధపడడంతో పట్టణంలోని కొందరు యువకులు వెంటనే స్పందించి గ్రామంలోని పలువురికి విషయం చెప్పడంతో అందరూ స్పందించి ఒక్క రోజులోని 50 వేల రూపాయల నగదును సుల్తానాకు అందించేందుకు సిద్ధమయ్యారు..ఈ క్రమంలో పట్టణానికి చెందిన యువకులు నెల్లూరుకు వెళ్లి నారాయణ వైద్యశాలలో చికిత్స పొందుతున్న సదరు మహిళా సుల్తానాను చూసి ఆమెకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులకు 50వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు... సుల్తానాకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె ఆరోగ్యం వెంటనే కుదుట పడాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు వారు తెలిపారు.. ఎక్కడో దగదర్తి మండలంలో ఓ మహిళకు జరిగిన ఇబ్బందిని తెలుసుకొని ఆమె వైద్య సేవల కోసం నగదును అందించి తమ మానవత్వాన్ని చాటుకున్న ఆత్మకూరు వాసులు నిజంగా అభినందినీయులు
Admin
Namitha News