Tuesday, 15 September 2026 10:51:43 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

మిట్స్ లో విజయవంతం గా జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం డి ఫెస్టా - 2K26

Date : 08 April 2026 07:05 PM Views : 161

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 08: అంగళ్ళు సమీపంలో గల డీమ్డ్ టుబి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్(డేటా సైన్స్) విభాగము వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోసియం డి ఫెస్టా - 2కే26 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాగ్నిక్ బెనర్జీ, డేటా అనలిటిక్స్ మేనేజర్, మైక్రోసాఫ్ట్ కంపెనీ, బెంగళూరు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డేటా సైన్స్ మరియు కృత్రిమ మేధస్సు (AI) ప్రస్తుత టెక్నాలజీ రంగంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు. విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా హ్యాండ్లింగ్, డేటా క్లీనింగ్, మిషన్ లెర్నింగ్, ఎస్ క్యూ ఎల్ వంటి టెక్నాలజీలపై పట్టు సాధించడం అవసరమని అన్నారు.సూపర్వైజ్డ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్, రియల్ టైమ్ ప్రాజెక్టుల ప్రాముఖ్యత, కో-పైలట్ వంటి ఆధునిక ఏ ఐ సాధనాలను ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు వివరించారు. ఆధునిక సాంకేతిక రంగంలో అత్యంత పరివర్తన కలిగించే రంగాలలో డేటా సైన్స్ ఒకటిగా అవతరించి డిజిటల్ పరివర్తన యుగంలో పరిశ్రమలలో కీలక పాత్ర పోషిస్తోంది అని అన్నారు. ప్రపంచం ప్రతి సెకనుకు భారీ మొత్తంలో డేటాను ఉత్పత్తి చేస్తూనే ఉన్నందున, సంస్థలు కార్యాచరణ అంతర్దృష్టులను సేకరించడానికి, కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేయడానికి మరియు వ్యూహాత్మక నిర్ణయాలను నడిపించడానికి డేటా సైన్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి అని అన్నారు. ప్రస్తుత ధోరణిలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు మెషిన్ లెర్నింగ్ (ML) డేటా సైన్స్‌లో అంతర్భాగాలుగా మారాయని, ఇవి ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఆటోమేషన్ మరియు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి వీలు కల్పిస్తాయి అని అన్నారు. ఆరోగ్య సంరక్షణ మరియు ఫైనాన్స్ నుండి ఇ-కామర్స్ మరియు వ్యవసాయం వరకు, డేటా ఆధారిత పరిష్కారాల ఉపయోగం సమస్యలను సంప్రదించే మరియు పరిష్కరించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తోంది అని అన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశం డేటా వినియోగంలో ముందంజలో ఉందని, ఈ రంగంలో అనేక ఉద్యగం అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు వాటిని అందిపుచ్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, డీన్- స్కూలోఫ్ కంప్యూటింగ్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎస్.కుసుమ, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎమ్ కిరణ్ కుమార్, డాక్టర్ కే.పుగజరాసి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :