నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబలకోట.1.3.24.పల్స్ పోలియో ను విజయవంతం చేద్దామని కురబలకోట మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మార్చి 3వ తేదీ ఆదివారం అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి 5సం లోపు పిల్లలందరికీ నిర్ధేశించిన పోలియో చుక్కలు బూత్ లలో పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది అన్నారు. మండల వ్యాప్తంగా 35 పోలియో చుక్కల బూత్ లు ఏర్పాటు చేశామని ఇప్పటికే ఈకార్యక్రమంలో పాల్గొను వైద్య ఆరోగ్య, విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సిబ్బందికి వాలంటీర్లు కు శిక్షణ ఇచ్చామన్నారు.ఒకవేళ 3వ తేదీ ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోనట్లైతే 4 మరియు 5 తేదీలు అనగా సోమ, మంగళవారం లలో సంబంధించిన బూత్ సిబ్బంది ఇంటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. కావున ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రులు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పోలియో లేని సమాజ స్థాపనకు సహకరించాలని కోరారు.
Admin
Namitha News