Sunday, 13 September 2026 07:40:51 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

మిట్స్ లో యన్.సి.సి. అధికారుల సమావేశం

Date : 30 January 2026 07:47 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 30 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎన్‌.సీ.సీ మరియు అసోసియేట్ ఎన్‌.సీ.సీ ఆఫీసర్ (ANO)ల సమావేశం ను (Conclave) నిర్వహించారు . ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్స్ మరియు కళాశాల నుంచి 250 మందికి పైగా ఎన్‌సీసీ, ఏఎన్‌వోలు మరియు క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి చిత్తూర్ 35 (ఎ) బెటాలియన్ ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్.వి. మోనిస్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కల్నల్ ఎన్.వి. మోనిస్ క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ నైపుణ్యాల అభివృద్ధి మరియు యువత సామాజిక అభివృద్ధిలో క్రియాశీలకంగా పాల్గొనాల్సిన అవసరాన్ని వివరించారు. లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ సాయుధ దళాల్లో ఉన్న వివిధ కెరీర్ అవకాశాలపై విలువైన మార్గదర్శకత్వాన్ని అందించారు. ఎన్‌.సీ.సీ లో శిక్షణ పొందిన విద్యార్థులకు భారత సైన్య విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని. ఎన్‌.సీ.సీ ‘C’ సర్టిఫికేట్ ఉన్నవారు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని కొన్ని పోస్టులకు రాత పరీక్ష లేకుండా లేదా ప్రత్యేక ప్రవేశాల ద్వారా ఎంపికకు అర్హులు అవుతారని అన్నారు. నేటి ఆధునిక సైన్యంలో డ్రోన్లు, రాడార్లు, శాటిలైట్లు, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరికరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గ్రామీణ ప్రాంత ఎన్‌.సీ.సీ విద్యార్థులకు క్యాంపులను ఏర్పాటు చేయడం ద్వారా ఎన్‌.సీ.సీ క్యాడెట్లలో సమస్యలను త్వరగా పరిష్కరించే సామర్థ్యం, కొత్త విషయాలను అర్థం చేసుకునే శక్తి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి అని అన్నారు. కార్యక్రమానికి పలమనేరు ఎస్ వి సి ఆర్, చిత్తూర్ పి.వి.కే.యెన్, పుంగనూరు ఎస్ ఆర్ జి డి సి మరియు మదనపల్లి బి టి కాలేజీ ఎన్‌.సీ.సీ విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి, గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్,మిట్స్ ఎన్‌.సీ.సీ కెప్టెన్ యెన్ నవీన్ కుమార్, మిట్స్ ఎన్‌.సీ.సీ విద్యార్థులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :