Thursday, 30 July 2026 12:30:17 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఏపీఎస్పీడిసిఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు పనులపై దృష్టి సారించాలి - కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేటాయింపును కోరిన జిల్లా కలెక్టర్

Date : 21 January 2026 05:32 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : ఏపీఎస్పీడిసిఎల్, నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు పనులకు సంబంధించిన అన్నిరకాల పెండింగ్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడిసిఎల్ సిఎండి ఛాంబర్ లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్. ఎపిఎస్పిడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి తో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి విద్యుత్, సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై ఏపీఎస్పీడిసిఎల్ సర్కిల్ పరిధిలోని ప్రాంతీయ జిల్లాల కలెక్టర్లు, సంబందిత ఎస్ఈ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె కలెక్టరేట్ నుండి హాజరయి జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి వివరించారు. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు అనంతరం గతంలో అన్నమయ్య జిల్లాకు కేటాయించబడిన 19 మెగావాట్ల విద్యుత్ ప్రస్తుతం కడప జిల్లాకు మార్చబడినందున మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు కనీసం 30 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యాన్ని కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి భూమిని గుర్తించి నివేదికలు పంపాలని సూచించారు. సీఎస్ విసి ముగిసిన ఆనంతరం.. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం కుసుం పురోగతి, పీఎం-సూర్య ఘర్ పురోగతి, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు, సూచనల మేరకు.. 2026 డిసెంబర్ నాటికి పిఎం కుసుమ్ పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్న ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ (ఎఫ్.ఎల్.ఎస్.) కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ, ఫీడర్ల ఏర్పాటు తదితర పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఏపీఎస్పీడిసిఎల్ అధికారి సోమశేఖర్, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: