Saturday, 12 September 2026 04:41:00 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

Date : 01 May 2026 08:22 PM Views : 254

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - ఆర్టీసీ 1,2 డిపోల ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి స్పష్టం - బస్టాండ్ ఆవరణంలో ఘనంగా మే డే వేడుకలు మదనపల్లె : ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీను) స్పష్టం చేశారు.శుక్రవారం మదనపల్లి బస్టాండ్ ఆవరణంలో మదనపల్లి 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి హాజరై ఎర్రజెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు బాగుంటేనే సంస్థల బాగుంటాయన్నారు.ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిలు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని కొనియాడారు.కార్మికులకు ఏవైనా ఇబ్బందులు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.అదేవిధంగా కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.వి కుమార్,అన్నమయ్య జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ చైర్మన్ పి.వి.బయ్యారెడ్డి,జిల్లా కార్యదర్శి బి.సాంబశివారెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు జి.మధుసూదన్,పి.శారద,మదనపల్లి 1,2 ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష,కార్యదర్శులు కె.శివయ్య,కె.ఈశ్వరప్ప,నరసింహులు,ప్రచార కార్యదర్శి బి.ఎన్ స్వామి,సిఏ బాబు 1,2 డిపోల ఈయు నాయకులు,కమిటీ సభ్యులు,ముఖ్య నాయకులు,మహిళా సభ్యులు,గ్యారేజ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :