Monday, 14 September 2026 06:53:16 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లి లో ఘనంగా దివ్యాంగ శక్తి కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్

కూటమి ప్రభుత్వం సంక్షేమ దిశగా మరో ముందడుగు దివ్యాంగ శక్తి పథకం లో బస్సు లలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం

Date : 18 March 2026 08:59 PM Views : 281

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 18 : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగానే ఉగాది కానుకగా 'దివ్యాంగశక్తి' పేరుతో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. మదనపల్లి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం "దివ్యాంగ శక్తి" (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) కార్యక్రమాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష తదితరులు. మదనపల్లి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం "దివ్యాంగ శక్తి" (దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం) కార్యక్రమాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించి,i బస్సు పాసులను, జీరో బస్సు టికెట్లను స్వయంగా దివ్యాంగులకు అందజేశారు. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ వారితో సెల్ఫీ దిగారు. అనంతరం వారి సమస్యలను, వారి అభిప్రాయాలను తెలుసుకొని సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పిజిఆర్ఎస్ సమావేశం మందిరంలో దివ్యాంగులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ రోజు నుండిదివ్యంగ శక్తి అమలు లోనికి రావడం ద్వారా 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తించనుంది. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్. మెట్రో ఎక్స్ ప్రెస్, ఆర్జీనరీ, సిటీ బస్సుల్లో దివ్యాంగులు ఇకపై ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇప్పటికే మహిళలకు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దివ్యాంగులకు అవకాశం ఇవ్వడంతో సంతోషదాయకమని ఈ పథకం ద్వారా జిల్లాలో సదరం ద్వారా 40 శాతం కంటే ఎక్కువ వికలత్వం ఉన్న వారు 42,560 మంది దివ్యాంగులు ఉన్నారు. వీరంతా కూడా ఆర్టీసీలో దివ్యాంగశక్తి పథకం కింద ప్రయాణించవచ్చు.. ప్రభుత్వ సదుపా యాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు

ఈ సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష మాట్లాడుతూ..ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని వికలాంగులకు పెన్షన్లు అందిస్తున్నామని, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్య నిర్ణయం తీసుకొని “దివ్యాంగ శక్తి” పథకం దివ్యాంగుల జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కీలక కార్యక్రమమని వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. వికలాంగులు ఎక్కడికైనా నిరభ్యంతరంగా ప్రయాణించేందుకు ఫ్రీ బస్ పాస్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇది దేశంలోనే అరుదైన విషయమని ఇతర రాష్ట్రాల్లో కనిపించని ప్రత్యేక పథకమని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని, ముఖ్యంగా ఫిజికల్‌గా ఛాలెంజ్ ఉన్న వ్యక్తులకు భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడం తమ బాధ్యతగా ఈ ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు. వికలాంగులు ఎలాంటి భయం లేకుండా సమాజంలో స్వేచ్ఛగా జీవించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని స్పష్టం చేశారు.ఈ పథకం ద్వారా వికలాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, వారి రోజువారీ అవసరాల కోసం ప్రయాణం సులభతరం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రెండవ డిపో మేనేజర్ అమరనాథ్, వెలుగు సెక్రటరీ ఎం.ఉదయ్ మోహన్ రెడ్డి,దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మౌలాలి, టిడిపి నాయకులు నవీన్ చౌదరి,బాలు స్వామి,బొమ్మిశెట్టి పురుషోత్తం,జంగాల వెంకటరమణ,కమలామర్రి కృష్ణ,ముసలికుంట నాగయ్య,మండిపల్లి మధుసూదన్ రెడ్డి,యర్రబల్లి వెంకటరమణా రెడ్డి,బోనాసి జాన్ బాబు,చల్లా నరసింహులు,బాబు నాయుడు,జీవి నాయుడు,రాధమ్మ,పులి మహాలక్ష్మీ,నాగమణి తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :