నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 12 : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఉద్యమ ర్యాలీలో బుధవారం రామసముద్రం మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చిత్తూర్ బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఏవో నిర్మలా దేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవ రెడ్డి,వైసీపీ స్టేట్ బిసి జనరల్ సెక్రటరీ గెవన్న,జడ్పీటీసీ రామచంద్రారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్,జిల్లా వైసీపీ రైతు సమైక్య సెక్రటరీ జయరామి రెడ్డి, వైస్ ఎంపిపి రమణారెడ్డి,వాల్మీకి జిల్లా నాయకులు దొడ్డిపల్లె ఆనంద,విద్యావేత్త రాయలసీమ రవీంద్రనాథ్, జిల్లా బిసి నాయకులు తిమ్మయ్య దర్శన్ గౌడ్,వైసీపీ జనరల్ సెక్రటరీ కేసీ పల్లె ఈశ్వర్ రెడ్డి,ఎస్సి సెల్ కృష్ణప్ప మండల బిసి అధ్యక్షులు రెడ్డివీరే గౌడ్, మండల మైనారిటీ నాయకులు సర్దార్ బాషా, ఈశ్వర్ రెడ్డి, బుడ్డారెడ్డి,కొమ్ము నారాయణస్వామి,జీకే చంద్ర, అమూల్ డైరీ కృష్ణ మూర్తి, విజయరాజు, చంద్రశేఖర్, ఆవులపల్లె ప్రసాద్ బాబు, ఈశ్వర్ రెడ్డి,ఉపసర్పంచ్ దొరబాబు,మున్వర్ బాషా, గొల్ల పల్లె నాగరాజ మంజునాథ్ రెడ్డి, పాలు డైరీ విజయ్,కేశవ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News