Monday, 14 September 2026 05:26:01 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

టీడీపీ కండువా వేసుకుంటేనే ట్రాన్స్‌ఫార్మర్

పీజీఆర్ఎస్ అర్జీలకే దిక్కే లేదని సీపీఐ ఆగ్రహం

Date : 25 May 2026 07:29 PM Views : 120

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టీడీపీ కండువా వేసుకుంటేనే ట్రాన్స్‌ఫార్మర్ పెడతామంటున్నారు పీజీఆర్ఎస్ అర్జీలకు దిక్కే లేదని సీపీఐ ఆగ్రహం సర్పంచ్ అనుమతి తీసుకురావాలని, టీడీపీ పార్టీ కండువా వేసుకుంటేనే ట్రాన్స్‌ఫార్మర్ వెంటనే ఫిట్ చేయిస్తామని స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని సీపీఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే. మురళి ఆరోపించారు. గాలివీడు మండలం దానంరెడ్డిగారిపల్లి పంచాయితీకి చెందిన రైతు పుల్లారెడ్డికి వెంటనే కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్‌లో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కే. మురళి మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంగా రైతు పుల్లారెడ్డి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించినప్పటికీ, ట్రాన్స్‌ఫార్మర్ శాంక్షన్ అయినా కూడా రైతు పొలంలో ఫిట్ చేయలేదన్నారు. విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే స్థానిక సర్పంచ్ అనుమతి తీసుకురావాలని చెబుతున్నారని, సర్పంచ్‌ను సంప్రదిస్తే “మా పార్టీ కండువా వేసుకుంటే వన్‌డేలో ట్రాన్స్‌ఫార్మర్ ఫిట్ చేయిస్తాం, లేకపోతే పని జరగదు” అని సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు ఈ సమస్యపై ఇప్పటికే మార్చి నెలలో పీజీఆర్ఎస్‌లో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చామని, మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు సంబంధిత అధికారులు స్పందించలేదన్నారు. దీంతో మళ్లీ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాల్లో ప్రజలు ఎంతో ఆశతో అర్జీలు ఇస్తున్నా అధికారులు వాటిని చెత్తబుట్టలో వేస్తున్నారే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి మాధవ్ కుమార్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :